RRR Movie : ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీ ఇప్పుడు ప్రస్తుతం అన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఈ మూవీ గురించే చర్చ మరియు ట్రెండింగ్ లో వున్న మూవీ ట్రైలర్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే రాజమౌళి గారు ఎప్పుడు చేసే పని కథను ముందు గానే ప్రేక్షకులకు వివరించడం మూవీ మీద ఎక్సపెక్టషన్స్ ను తక్కువ చేసి థియేటర్స్ కి రప్పించిన తరువాత అనుకున్న దానికంటే ఎక్కువగనే చూపించడం సర్వసాధారణం, ముఖ్యంగా ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు అని చెప్పాలి.
మనకు ట్రైలర్ లో చూపిచ్చిన సన్నివేశాలను గమనిస్తే రాంచరణ్ డ్యూయెల్ రోల్ (రెండు విడి విడి పాత్రలు) పోషిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బ్రిటిష్ అధికారుల కొరకు పనిచేస్తున్న రామ్ చరణ్ మరియు కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు మనకు ట్రైలర్ లో కనిపించే అంశాలు.
అందులో రామ్ చరణ్ తో చెప్పిన డైలాగు చావుని కూడా ఆనందంగా ఇచ్చేస్తాను బాబాయ్ అని చెప్పడం ఈ సందేహానికి దారి తీస్తుంది, ఎందుకంటే మరోక్క పాత్రలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు, ఇందులో కథ మరియు కథనాలు కల్పితమైన అల్లూరి సీతారామరాజు గారి పాత్ర.. బ్రిటిష్ వారి కోసం వారి కింద పని చేసే పాత్ర కాదు అని మా ఉద్దేశం అంటే దీని మూలంగా తెలిసేది ఏంటి అంటే రామ్ చరణ్ పాత్ర మధ్యలో ముగిసి అల్లూరి సీతారామరాజుగా మొదలవుతుంది అని తెలుస్తుంది.
ట్రైలర్ లో చూపెట్టినట్లుగా భగ భగ మండే అగ్ని జ్వాలలు నుండి వచ్చే బాణం నుండి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ మొదలవబోతుంది అని తెలుస్తుంది. ఆ తరువాత కొమరం భీమ్ (ఎన్టీఆర్) మరియు అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్) ఇద్దరు కలిసి బ్రిటిష్ వారితో ఎలా పోరాడారు అనేది తెరపై చూడాల్సిందే.
RRR Pre Release Event :
ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పటికి మూడు సార్లు వాయిదా పడింది. కొన్ని అనుకోని కారణాల వలన ఒక్కసారి వాయిదా పడితే కరోనా కారణంగా మరో రెండు సార్లు వాయిదా పడింది. ఇక ఈసారి ఎట్టి పరిస్థితిలోను ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసి జనవరి 7 న రిలీజ్ డేట్ ని ప్రకటించి, ప్రమోషనలను సైతం కానిచ్చేసి ఇక బుకింగ్ కూడా వరల్డ్ వైడ్ గా ప్రారంభించారు. కానీ దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. ఒమిక్రాన్ విజృంభణతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.
దీంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొన్నిసార్లు పరిస్థితులు మన చేతులలో ఉండవు.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. మాకు వేరే దారి లేక మేము ఈ పనిని చేస్తున్నాము. కానీ మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాము.. ఈ మూవీపై ఉన్న అంచనాలను అలాగే ఉంచమని కోరుతున్నాము. మీకు ప్రామిస్ చేస్తున్నాము.. మంచి సమయంలో ఈ మూవీని రిలీజ్ చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే కొద్ది రోజుల క్రితం ‘ఆర్ఆర్ఆర్’ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది
ఇక ఇప్పుడు భారీ మల్టీస్టారర్ మూవీ అంతకుమించి అన్నట్లుగా నిర్వహించేందుకు ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి లను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది.
రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలయ్య, మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ ప్రముఖులు అజయ్ దేవగన్, అలియా భట్ అజయ్ దేవగన్, అలియా భట్ వంటి ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి చేయనున్నారు. దీంతో భారీ తారాగణం మధ్య జరగబోయే ఈవెంట్లో అభిమానుల తాకిడి తట్టుకోవడం సాధ్యమా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
2022 సంవత్సరం లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుందాం అలాగే రాబోయే మూవీస్ కూడా ప్రేక్షకులకు.. ఇండస్ట్రీకి మరియు మూవీ లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఆశించుదాం.