Bright Telangana

ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన ఖమ్మం కుర్రోడు.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం

తక్కువ ఖర్చుతో, ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి బైక్ నడుస్తున్నప్పుడే ముందు చక్రం ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అయ్యేవిధంగా టెక్నాలజీ రూపొందించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఖమ్మంకు చెందిన రాకేష్. పెట్రోల్,డీజిల్ రెట్లు పెరుగుతుండడం వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో ఖమ్మం నగరం శ్రీనివాస్ నగర్ కు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు గార్లపాటి రాకేష్ తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే విధంగా ఎలక్ట్రికల్ బైక్ తయారు చేసి ఔరా అనిపించారు.