Bright Telangana
Image default

Mega Star Movie Updates: ఊర మాస్ అవతార్.. మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

chiranjeevi 154 movie

మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా మెగా 154వ ప్రాజెక్ట్ ని షురూ చేశారు. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ట్రెండ్‌ అవుతోంది. చిరంజీవి లుక్‌ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. ‘మాస్‌ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Shruti Haasan in Chiranjeevi 154 Movie : శ్రుతిహాసన్ టాలీవుడ్ కి కొంతకాలం పాటు దూరమైంది. దీంతో తన కెరియర్ ను చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడింది. అందులో భాగంగా ఆమె చేసిన ‘క్రాక్’ మూవీ బాగా కలిసొచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ మూవీ శ్రుతిహాసన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను తెచ్చిపెట్టింది.

ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ నుంచి కూడా అవకాశం శ్రుతిహాసన్ ను వెతుక్కుంటూ వెళ్లింది. ఈ మూవీ తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని శ్రుతిహాసన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రుతిహాసన్.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ కాంబినేషన్లోని మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీకి(MEGA 154) కూడా సైన్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు రవీంద్ర (బాబీ) ‘వాల్తేర్ వీర్రాజు’ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో కథానాయికగా శ్రుతిహాసన్ ను సంప్రదించారు. దాదాపు ఆమెనే ఖరారు అవుతుందని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Mega Star Chiranjeevi Mega Record : మెగాస్టార్ చిరంజీవి న్యూ రికార్డు సృష్టించారు. ఒకే నెలలో 4 మూవీస్ ను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య, మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో 154వ చిత్రం, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ మూవీస్ డిసెంబరు నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు చిరంజీవి ఒకే ఏడాది 4 అంతకంటే ఎక్కువ మూవీస్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఒక్క నెలలోనే 4 మూవీస్ షూటింగ్స్ చేస్తూ ఒకే నెలలో అత్యధిక మూవీస్ చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు.

mega-star chiranjeevi mega record

ఈ డిసెంబర్ లోనే 4 మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరోగా రికార్డ్ సృష్టించారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ షూటింగ్లలో పాల్గొంటూనే ఇతర కార్యక్రమాలకు కూడా చిరంజీవి అటెండ్ అవ్వడం ఆయన స్టామినాను తెలియజేస్తోంది. ఇక ఇవే కాకుండా కొందరు దర్శకులు మెగాస్టార్ చిరంజీవికి కథలు చెప్పడానికి సిద్దమవుతున్నారట. ఆయన కూడా యంగ్ డైరెక్టర్లతో చేయడానికి తానెప్పుడు సిద్దమే అని అనడంతో వారు ముందువరసలో ఉన్నారట.. మరి చిరంజీవి ఇలా వరుస మూవీస్ తో బిజీ కావడం మెగా ఫ్యాన్స్ కి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అందుకే మెగా ఫ్యాన్స్ మెగాస్టారా .. మజాకానా అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Megastar Chiranjeevi new movie with venky kudumula

వెంకీ కుడుములతో మూవీ ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి :

మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీస్ తో రాకెట్ల దూసుకుపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 156వ మూవీకి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, వెంకీ కుడుమల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మూవీను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీకి డాక్టర్ మాధవి రాజు సహ నిర్మాత. ఈ మూవీకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

చిరంజీవికి ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో తన శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తానని డైరెక్టర్ వెంకీ కుడుముల తెలిపాడు. వెంకీ కుడుములకు ఈ అవకాశం దక్కడం పట్ల తోటి దర్శకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

bhola shankar movie

మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’ మూవీ కోసం భారీ సెట్స్ :

మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా భోళా శంకర్ మూవీని షురూ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నవంబర్ 11న ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు.

సోమవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఏస్ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అంతే కాదు ఈ మూవీ కోసం మరికొన్నిసెట్స్ కూడా వేయనున్నారట. ఈ మూవీ చాలా భాగం సెట్స్ లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఫస్ట్ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి పై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

భోళా శంకర్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీ మీద అంచనాలు పెరిగాయి. టైటిల్ పోస్టర్, రాఖీ పండుగ నాడు విడుదల చేసిన స్పెషల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ మూవీలో చిరంజీవిని మెహర్ రమేష్ విభిన్న గెటప్స్‌లో చూపించబోతోన్నారు. అద్భుతమైన కథకు.. మరింత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక బృందం తోడైంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా  నటించనుండగా, చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. పక్కా కమర్షియల్‌గా ఈ మూవీ ఉండబోతోంది.

మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. 2022లో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.