Bright Telangana
Image default

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Most Eligible Bachelor Movie closing collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. దసరా సెలవు కూడా కలిసి రావడంతో సూపర్ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ మూవీ మంచి ఓపెనింగ్సే నమోదయ్యాయి. దాంతో ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద ఫుల్ రన్ పూర్తీ అయ్యే టైం కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ వివరాలను ఒకసారి గమనిస్తే….

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ షేర్ :

నైజాం7.60 cr
సీడెడ్4.08 cr
ఈస్ట్1.25 cr
వెస్ట్1.03 cr
ఉత్తరాంధ్ర2.44 cr
గుంటూరు1.41 cr
నెల్లూరు0.87 cr
కృష్ణా1.14 cr
ఏపీ + తెలంగాణ (మొత్తం)19.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్3.95 cr
వరల్డ్ వైడ్ (మొత్తం)23.77 cr

అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ ముగిసేసరికి 4.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది.