Bright Telangana
Image default

పునరావాస కల్పనలో ప్రాధాన్యత – జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు

District Collector S. Venkatrao

మహబూబ్ నగర్ : గుడుంబా, కల్లు వంటి వాటి తయారీని వదిలేసిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు గిరిజన సంక్షేమ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలోని డీటీఓ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా గిరిజనులకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఫైళ్లను పరిశీలించారు. జనాభా ప్రాతిపదికన అన్ని పధకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఆధికారులకు సూచించారు. ప్రత్యేకించి ఆర్థిక చేయూతనందించే కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, వచ్చిన దరఖాస్తులను మండలాల వారీగా, జనాభా ప్రాతిపదికన స్వీకరించాలన్నారు. పునరావాసం కల్పించేందుకు జిల్లాస్థాయిలో సరైన నిధులు లేకుంటే ఇతర పథకాలు
గానీ, రాష్ట్ర స్థాయికి నివేదించాలని ఆదేశించారు.

అనంతరం ఈ-ఆఫీసులో ఫైళ్లను పరిశీలిస్తూ అన్ని ఫైళ్లు కేవలం ఈ – ఆఫీసులోనే నిర్వహించాలని, మ్యానువల్ గా నిర్వహించవద్దని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి శ్రీనివాస్ ఉన్నారు. ఫైళ్ల నిర్వహణలో చురుకుగా ఉండాలి ఫైళ్ల నిర్వహణలో అధికారులు, సిబ్బంది చురుకుగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ-ఆఫీసులో ఆయా విభాగాల అధిపతులు, సిబ్బంది నిర్వహిస్తున్న ఫైళ్లను కంప్యూటర్ ద్వారా పరిశీలించారు. సి-సెక్షన్లో ఎస్సీ, ఎస్టీ కేసులు, తదితర ఫైళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ కె.స్వర్ణలత, కలెక్టర్ కార్యాలయ ఏఓ ప్రేమ్ రాజ్ తదితరులున్నారు.