Radhe Shyam Movie Review : ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మూవీ రాధే శ్యామ్. పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే కలిసి నటించిన ఈ మూవీ ఇప్పటికి ఎన్నో వాయిదాల అనంతరం ఈ రోజు (మార్చి 11న) వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉంది ఎవరి నటన కి ఎక్కువ మార్కులు పడ్డాయి ఏం చెబుతున్నాయి.
ఇక ఈ కథ విషయానికి వస్తే .. ప్రభాస్ ఇటలీ లో నివసించే విక్రమాదిత్య అనే ప్రముఖ జ్యోతిష పాత్రల్లో కనిపిస్తాడు హస్తసాముద్రికం లో ఆయన అంచనాలు నిజమవుతాయి. ఇండియా లో పెద్ద వాళ్ళకి కూడా తమ ఫ్యూచర్ గురించి చెబుతూ ఉంటాడు విక్రమాదిత్య. ప్రధాని ఇందిరా గాంధీ చెయ్యి చూసిన విక్రమాదిత్య .. త్వరలో ఇండియాలో ఎమర్జన్సీ పెట్టబోతున్నారని చెప్పడంతో దేశం వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి హీరో (ప్రభాస్) సడెన్ గా కుటుంబంతో సహా వెళ్లి ఇటలీలో సెటిలవుతాడు. తన చేతిలో ప్రేమ రేఖ లేదని నమ్మి తన జీవితంలోకి వచ్చిన ప్రతి అమ్మాయితోనూ కొంత కాలం వరకే ప్రయాణం సాగించి.. ఆ తర్వాత వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోతుంటాడు విక్రమాదిత్య (ప్రభాస్). అనుకోకుండా విక్రమాదిత్య (ప్రభాస్) తొలిచూపులోనే పూజా హెగ్డే తో ప్రేమలో పడతాడు. ఇలా కలిపిన వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది కథ.
ప్రభాస్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు కానీ కొన్ని సన్నివేశాలలో ఇబ్బందిగా చేసినట్లు అనిపించింది. కానీ తన లుక్స్ సాహో కన్నా చాలా బెటర్ గా ఉండగా, లవ్ స్టొరీ కాబట్టి పెద్దగా కష్టపడకుండా సులభంగానే తన పాత్ర లో మెప్పించాడు అని చెప్పాలి. ఇక పూజా హెగ్డే పర్వాలేదు అనిపించింది కానీ అక్కడక్కడా ఆమె పాత్ర అక్కడ అక్కడ చిరాకు తెప్పించేలా ఉంటుంది, ఇద్దరి పెయిర్ బాగుంది, ఇక మిగిలిన స్టార్ కాస్ట్ చాలా పెద్దదిగా ఉన్నా కానీ ఎవ్వరికీ పెద్దగా స్కోప్ లేదు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్య శ్రీ గారిని మూవీలో తీసుకున్నా అసలు ఏమాత్రం ప్రాదాన్యత లేని పాత్ర ఇచ్చారు. మిగిలిన యాక్టర్స్ జస్ట్ ఓకే అనిపించుకున్నారు. ఇక మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ రెండూ మూవీకి బిగ్ ప్లస్ పాయింట్స్. సాంగ్స్ ఎంత బాగున్నాయో చూడటానికి కూడా అంతే బాగున్నాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ మూవీ ఫీల్ కి తగ్గట్లు చాలా బాగా మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగున్నా హాస్పిటల్ ఎపిసోడ్ కొంచం బోర్ కొట్టిస్తుంది.
సెకెండ్ ఆఫ్ లో కొన్ని సన్నివేశాలు కూడా చాలానే బోర్ కొట్టించాయి. సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించేలా ఉండగా, విజువల్స్ అద్బుతం అనిపించేలా ఉంటాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే రాధాకృష్ణ చెప్పాలనుకున్న కథ కొత్తగా ఉన్నప్పటికీ కూడా ఆ కథకి పూర్తిగా ప్రాణం పోయలేక పోయాడు. ఫస్టాఫ్ కొంచం అక్కడక్కడా బోర్ కొట్టినా చాలా వరకు మెప్పించింది. కానీ సెకెండ్ ఆఫ్ లో మాత్రం ట్రాక్ తప్పి కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టగా భారీ ఆశలు పెట్టుకున్న సునామీ ఎపిసోడ్ బాగుంది కానీ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ అయితే కాలేదు. కానీ ఓవరాల్ గా ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ ని క్లాస్ వే లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బాగానే ప్రజెంట్ చేసి పర్వాలేదు అనిపించే మార్కులు వేయించుకున్నాడు అని చెప్పొచ్చు కానీ అంచనాలను మాత్రం అందుకోలేదు.
‘రాధేశ్యామ్’ మూవీ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు మిస్సింగ్.. అసలు ఏం జరిగింది?
ఈ మూవీలో పరమహంసగా రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెబెల్ బిల్లా మూవీల తరువాత మరోసారి ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి నటించిన మూవీ కావడంతో అభిమానులు ఈ మూవీ లో వీరిద్దరి మధ్య వచ్చే సన్ని వేశాలు ఎలా వుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారికి ఓవర్సీస్ లో షాక్ తగిలినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కృష్ణంరాజు పోషించిన పాత్రని ఇతర భాషలు అయినా తమిళ మలయాళ కన్నడ మరియు హిందీ వెర్షన్ లకు గానూ సత్య రాజ్ చేత చేయించారు.
అది మూవీ ట్రైలర్ లోనూ మేకర్స్ స్పష్టం చేశారు. అయితే యుఎస్ లో ప్రదర్శిస్తున్న తెలుగు ప్రింట్ లో మాత్రం రెబల్ స్టార్ కృష్ణంరాజు మిస్ అయ్యారట. ఆ పాత్రలో సత్యరాజ్ కనిపించడం అక్కడి వారిని ప్రస్తుతం షాక్ కు గురిచేస్తోందని చెబుతున్నారు. కృష్ణంరాజు పాత్రని తెలుగులో చూపించాలనుకున్న మూవీ మేకర్స్ మరో ఆలోచన రావడంతో సత్యరాజ్ చేత అదే పాత్రని చేయించారని తెలిసింది. అయితే దాన్నే తెలుగు వెర్షన్ కు కూడా వాడేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మూవీ మేకర్స్ ఇలా ఎందుకు చేశారన్నది ఇప్పుడు ఎవరికీ అంతు పట్టడం లేదు.
చాలా సంవత్సరాల తర్వాత తనకు తగ్గ పాత్ర కుదరడంతో కృష్ణంరాజు కొన్ని కీలకసన్నివేశాలలో ప్రభాస్ తో నటించడమే కాకుండా కృష్ణంరాజు నే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. అయితే యుఎస్ కు పంపించిన ప్రింట్ లో కృష్ణంరాజు ప్లేస్ లో సత్యరాజ్ ని ఎందుకు చూపించారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మూవీ మేకర్స్ నుండి. అలాగే యుకె కు పంపించిన ప్రింట్లలోనూ ఇదే పరిస్థితి పునరావృతం కావడం రెబల్ స్టార్ కృష్ణంరాజు అభిమానులని షాక్ కు గురిచేస్తోంది.
ఇక రాధే శ్యామ్ మూవీ హైలెట్స్ విషయానికి వస్తే ప్రభాస్ పెర్ఫార్మెన్స్, స్టొరీ కాన్సెప్ట్ ఐడియా బాగుండటం, క్వాలిటీ, విజువల్స్ అద్బుతంగా ఉండటం, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. స్లో నరేషన్, స్టొరీ కనెక్ట్ అయ్యేలా చెప్పక పోవడం, సెకెండ్ ఆఫ్ డ్రాగ్ అవ్వడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్.
మాస్ ఆడియన్స్ కి మూవీ నచ్చే అవకాశం తక్కువగా ఉండగా క్లాస్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, లవ్ స్టొరీలను చూడటానికి ఇష్టపడేవాళ్ళకి మూవీ నచ్చే అవకాశం ఉంటుంది, రెగ్యులర్ ఆడియన్స్ కొంచం బోర్ సీన్స్ అండ్ స్లో నరేషన్ ని ఓపికతో ఓవర్ కం చేస్తే ఎబో యావరేజ్ అనిపిస్తుంది మూవీ…
మొత్తం మీద రాధే శ్యామ్ మూవీ కి మా రేటింగ్ 2.5 స్టార్స్..