Rowdy Boys Trailer : దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. జనవరి 14న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. అదే రిలీజ్ డేట్‌లో నాగార్జున అక్కినేని నటించిన బంగార్రాజు మూవీతో క్లాష్ కానుంది.
రౌడీ బాయ్స్ మూవీలో సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి మరియు కోమలీ ప్రసాద్ ఇతర సహాయక పాత్రల్లో నటించారు. మధి సినిమాటోగ్రఫీని నిర్వహించగా, మధు ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.