Bright Telangana
Image default

RRR Movie Postpone: ‘భీమ్లా నాయక్’ ను ముంచేసిన ఆర్ఆర్ఆర్ మూవీ

RRR Movie Postpone

RRR Movie Postpone : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ జనవరి 7న రిలీజ్ అనగానే ఈ మూవీతో పోటీ ఎందుకని చాలా మూవీస్ పోస్టుపోన్ చేశారు. తీరాచూస్తే.. సారీ చెప్పి సైలెంట్ గా తప్పుకున్నారు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ లో ఇంపార్టెంట్ వీక్ కానీ ఈసారి ఎవ్వరికీ కాకుండా పోయింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలని టార్గెట్ చేసిన మూవీ మేకర్స్ తలలు పట్టుకొని కూర్చున్నారు ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ మూవీకి మన రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ సమస్య కూడా అసలు లేనేలేదు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్స్ మినహాయిస్తే పరిస్థితులు బాగానే ఉన్నాయి, రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా మూతపడిన థియేటర్ల రీ ఓపెన్ తో ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారంతా. కానీ నార్త్ ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లో కర్నాటక, తమిళనాడు మరియు కేరళలో ఆంక్షలున్నాయంటూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వాయిదా వేశారు మూవీ మేకర్స్.

500 కోట్ల భారీ బడ్జెట్ అందులోనూ పాన్ ఇండియాను టార్గెట్ చేసిన మూవీ కావడంతో రాజమౌళి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కావచ్చు. కానీ ఆ దెబ్బకి మిగతా మూవీస్ లెక్కలన్నీ మారిపోయాయి. జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం లాక్ చేసిన తర్వాత ఆ డేట్ దగ్గర్లోకి రావడానికి ఏ మూవీస్ ధైర్యం చేయలేదు. రాధేశ్యామ్ మూవీ మేకర్స్ మాత్రం ఈ సంక్రాంతికి జనవరి 14న పక్కా అని ప్రకటించారు. కానీ ఈ మూవీ కూడా వాయిదా పడినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మార్చి వరకు కరోనా కనుక తగ్గితే మార్చి 18న ‘రాధే శ్యామ్’ మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

అయితే వారం గ్యాప్ తో పాన్ ఇండియా మూవీస్ ‘ఆర్ఆర్ఆర్’, రాధేశ్యామ్ కారణంగా దాదాపు 15 రోజులు ముఖ్యంగా సంక్రాంతి సీజన్ బ్లాక్ అయింది. చాలా మీటింగ్స్ తర్వాత భీమ్లా నాయక్ మూవీ వెనక్కి వెళ్లేలా చేశారు. దీంతో భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ మూవీ ఇంకా 10 డేస్ షూటింగ్ పెండింగులో ఉండడంతో సంక్రాంతి రావడం లేదు. అలాగే బాలీవుడ్ నుంచి కూడా మూవీస్ ని పోస్టుపోన్ చేశారు. తీరా చూస్తే తను రాకా.. వేరే వాళ్లు వచ్చే పరిస్థితి లేక.. జనవరి 7న కాస్త పెద్ద మూవీస్ చేతి నుంచి జారిపోయింది.

2022 ఫస్ట్ ఫ్రైడే జనవరి 7న అసలు పెద్ద మూవీస్ లేకుండా అయింది. ఇప్పుడే కాదు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ వల్ల గతంలోనూ తేడాలొచ్చాయి. ఇప్పటికి మూడు సార్లు మంచి డేట్స్ ఫిక్స్ చేసుకుని తీరా ఆ డేట్ దగ్గరపడుతున్న టైంలో మేము రాలేమని ‘ఆర్ఆర్ఆర్'(RRR Movie Postpone) మూవీ మేకర్స్ చెప్పిన ప్రతీసారి ఫిల్మ్ ఇండస్ట్రీకి చుక్కలే కనిపించాయి.

భారీ బడ్జెట్ మూవీ ఇండియా వైడ్ ప్రొజెక్ట్ కావాలనుకునే మూవీ కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రతీసారి మంచి సీజన్ వెతుక్కుంటున్నారు మూవీ మేకర్స్. కాపీ రెడీ అయినప్పుడే ఈ మూవీని 2021 డిసెంబర్లోనే రిలీజ్ చేసుంటే బాగుండేది. లేదూ సమ్మర్ వరకు సైలెంట్ గా ఉన్నా సరిపోయేది. ఈ రెండూ చేయలేదంటూ బయటికి జాలి చూపిస్తున్నా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ పై చాలామంది కోపంగా ఉన్నవాళ్లూ ఉన్నారు. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో పాటు కరోనా కారణంగా ఏమి చేయలేని పరిస్థితుల్లో వున్నారు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్ మరియు అంతా ఫేట్ అంటున్నారు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫ్యాన్స్.