Bright Telangana

డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్ట్..!

ముంబై డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు NCB అధికారులు. ఉదయం నుంచి విచారిస్తున్న అధికారులు డ్రగ్స్‌ కేసులో ఆధారాలు లభించడంతో ఆర్యన్‌ను అరెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు.
సముద్రం మధ్యలో నిర్వ‌హిస్తున్న క్రూయిజ్‌ రేవ్‌ పార్టీలో ఆర్య‌న్ ఖాన్ అడ్డంగా బుక్కారు. ఆర్యన్‌ఖాన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌, నుపూర్‌ సారిక, ఇస్మీత్ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాలు దొరికిన‌ట్లు తెలిపారు.

అసలు వీరికి ఈ డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో విచారిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. మరోవైపు తీర ప్రాంతాల్లో దాడులు ముమ్మరం చేశారు అధికారులు. ఈ రైడ్స్‌లో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో మరో భారీ డ్రగ్‌ ముఠా గుట్టు రట్టయింది. అంథేరీలో 5 కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎన్సీబీ అధికారులు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా ఆస్ట్రేలియాకు తరలించే ప్రయత్నం చేసింది.