Bright Telangana
Image default

Supreme Court : విల్లు రాయకున్నా.. ఆడబిడ్డకు తండ్రి ఆస్తిలో వాటా హక్కు : సుప్రీం కీలక తీర్పు

Supreme Court Gives Equal Inheritance Right to Daughters

Supreme Court Gives Equal Inheritance Right to Daughters : హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. వీలునామా రాయకుండా మరణించిన తండ్రి సొంతంగా సంపాదించిన మరియు ఇతర ఆస్తులను కుమార్తెలకు వారసత్వంగా పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి పై.. తండ్రి వారసులైన అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త మరియు మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

మద్రాసు హైకోర్టు అప్పీల్‌కు ప్రతిస్పందనగా దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి హిందూ వారసత్వ చట్టం ప్రకారం వీలునామా రాయకుండా మరణిస్తే.. ఆడబిడ్డ(సొంత కుమార్తె)కు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని అన్నా లేదా తమ్ముడి పిల్లలకు హక్కు ఉంటుందా? అన్నదానిపై కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది.

మార్చి 1, 1994లో ఈ కేసుకు సంబంధించి తమిళనాడుకు చెందిన ట్రయల్‌ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్‌ డేట్‌ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్‌.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం.Supreme Court Gives

Related posts

Telangana: దీపావళి క్రాకర్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Hardworkneverfail

Supreme Court: థియేటర్లలో బయటి ఆహారాలకు అనుమతి లేదని తీర్పు..

Hardworkneverfail