Temporary relief for seized theatres in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌లో సీజ్ చేసిన థియేటర్లకు తాత్కాలిక ఉపశమనం లభించింది. సీజ్ చేసిన థియేటర్లకు అవసరమైన అన్ని నిబంధనలను నెరవేర్చడానికి ఒక నెల సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. సీజ్ చేసిన థియేటర్లను తిరిగి తెరవవచ్చని, థియేటర్ల యాజమాన్యం సంబంధిత జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో 83 థియేటర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి పేర్ని నాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. టాలీవుడ్ నటుడు నారాయణమూర్తి మంత్రి పేర్ని నానితో సమావేశమై కొనసాగుతున్న సమస్యపై చర్చించారు.