ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విండోస్ 11 అప్‌డేట్ వచ్చేసింది. వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియన్ మార్కెట్‌లోకి విండోస్ 11ను విడుదల చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Welcome to the world, #Windows11! Learn all about the latest Windows experience here 👇https://t.co/0OXlNxEFRq
— Windows (@Windows) October 4, 2021
విండోస్ 11ను డౌన్‌లోడ్ చేసుకోనే ముందు మీ ల్యాప్‌టాప్ కాని పీసీ క్యాపబిలిటీస్‌ను పరిశీలించుకోవాలి. పీసీ హెల్త్ చెకప్ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాప్‌టాప్ లేదా పీసీ విండోస్ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ విండోస్ 11కు అనుగుణంగా ఉన్నట్టు నిర్ధారించుకొన్న తరువాత. సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్ అప్‌డేట్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్ అప్‌డేట్‌లో అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. సిస్టమ్ అప్‌డేట్‌కి అనువుగా ఉంటే అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేస్తే.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
విండోస్ 11 టాప్ ఫీచర్స్..
* విండోస్ 8 నుంచి విండోస్ 10 వస్తోన్న లైవ్ టైటిల్స్ ఆప్షన్‌ని తొలగించారు.
* మైక్రోసాఫ్ట్ చెబుతున్నదాని ప్రకారం యూజర్ ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పులను ప్రవేశపెట్టింది.
* విండ్స్ స్టార్ట్ బటన్, టాస్క్‌బార్‌లో పలు మార్పులు ప్రవేశపెట్టింది.
* విండోస్ 11 వేగంలో, RAM వినియోగంలో పనితీరు విండోస్ 10 కంటే మెరుగ్గా ఉంటుంది.
* అదనంగా వినియోగ దారుల కోసం మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
* మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.