YS Vivekananda Reddy Murder Case : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కారు డ్రైవర్ దస్తగిరి సంచలన స్టేట్ మెంట్ వెలుగులోకి వచ్చింది. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వలేదని వివేకా హత్యకు గంగిరెడ్డి ప్లాన్ చేశారని దస్తగిరి ఒప్పుకున్నారు. 40 కోట్లు ఇస్తానని ఎర్ర గంగిరెడ్డి చెప్పారని, అయినా తాను హత్య చేయలేనని చెప్పానని కన్ఫెషన్ రిపోర్టులో పేర్కొన్నాడు. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు డ్రైవర్ దస్తగిరి. స్టేట్‌మెంట్‌లో ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్యలో నలుగురు పాల్గొన్నట్లు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి హత్య చేసినట్లు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు దస్తగిరి. బెంగుళూరులోని స్థల వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఎర్ర గంగిరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలిపాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మోసం చేశారంటూ మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. దీనిపై అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.