Renu Desai, Akira Nandan test positive for coronavirus : టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. రేణూ దేశాయ్ తో పాటు ఆమె కొడుకు అఖీరా నందన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో ఈరోజు స్వయంగా వెల్లడించింది.
ఇంట్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ నాకు, అఖీరా నందన్ కు ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చింది . నేను, అఖీరా ఇప్పుడు కోలుకుంటున్నాము. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. 3వ వేవ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ఆమె ప్రతి ఒక్కరినీ అభ్యర్థించింది మరియు మాస్కులు ధరించండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. అని క్యాప్షన్ ఇచ్చింది. నేను 2021 రెండు డోసుల వ్యాక్సినేషన్ వేయించుకున్నాను. అఖీరాకు మాత్రం ఒకటే డోస్ అయ్యింది. రెండవ డోస్ వ్యాక్సిన్ వేయించాల్సిన సమయంలోనే కరోనా పాజిటివ్ అని తేలింది.. అంటూ రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇప్పుడు, ఆమె ఫాలోవర్లు త్వరగా కోలుకోవాలని కోరుతూ సందేశాలతో ఇంటర్నెట్ సందడి చేస్తోంది. ఇటీవలి కాలంలో, చాలా మంది సినీ ప్రముఖులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది.