BF-7 Omicron Variant entered in India : చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించింది. డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
గుజరాత్ లోని వడోదరలో ఓ ఎన్ఆర్ఐ మహిళకి ఒమిక్రాన్ బిఎఫ్ 7 వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గురిని ఐసోలేషన్ కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. విదేశీ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఇండియాలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులను అధికార వర్గాలు గుర్తించాయి.
గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒక కేసు నమోదయిందని అధికారి పేర్కొన్నారు. ఇండియాలో తొలిసారి ఈ వేరియంట్ ను గుర్తించారు. గత అక్టోబర్ నెలలో గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు.
చైనాలో కేసులు పెరుగుదలకు బీఎఫ్ 7 వేరియంట్ కారణమని అధికార వర్గాలు వెల్లడించాయి. అధికంగా బీజింగ్ లో బీఎఫ్ 7 వేరియంట్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా వైరస్ సోకుతోందని వెల్లడించారు. ఇప్పటికే అమెరికా, యూకే, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ సహా యూరోయిన్ దేశాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.