Bright Telangana
Image default

Facebook: పేరు మార్పిడి వివాదంలో ఇరుకున్న ఫేస్‌బుక్‌..!

Facebook fined over £50m

పేరు మార్చుకొన్నా.. ఫేస్‌బుక్‌ను వివాదాలు వీడటంలేదు. అమెరికాకు చెందిన టెక్‌ సంస్థ మెటా కంపెనీ వ్యవస్థాపకుడు నేట్‌ స్క్యూలిక్‌ కోర్టును ఆశ్రయించారు. రీబ్రాండింగ్‌ పేరిట ఫేస్‌ బుక్‌ తమ సంస్థ పేరును దొంగలించిందని ఆరోపిస్తూ.. కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో ఫేస్‌బుక్‌ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినందుకే ఇలా చేసిందని ఆయన వెల్లడించారు.ఫేస్‌బుక్‌ తన సంస్థను కొనుగోలు చేయడంలో విఫలం కావడంతో.. మీడియా శక్తిని ఉపయోగించి కనుమరుగు చేయాలని చూస్తోందని ఆరోపించారు.

ఫేస్‌బుక్‌ ఎప్పుడూ చెప్పేదొకటి.. చేసేదొకటి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనను బహిరంగ వివరణగా భావించాలని ఆయన వెల్లడించారు. గత మూడు నెలలుగా కంపెనీని చౌకగా విక్రయించాలని ఫేస్‌బుక్‌ లాయర్లు వెంటాడుతున్నారని నేట్‌ వెల్లడించారు. తాము ఫేస్‌బుక్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 28వ తేదీన పేరును మెటాగా మారుస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘మెటా కంపెనీ’ కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది.

వివాదంలో చిక్కకున్న ప్రతి సారి ఆధికంగా నష్టం వాటిల్లడంతో ఫేస్‌బుక్‌ మాతృసంస్థ పేరు మార్చాలని డిసైడ్‌ అయ్యారు.. మెటా గా కూడా నామకరణం చేశారు. కంపెనీ వార్షిక సమావేశంలో ఫేస్‌బుక్ పేరు మారుస్తున్నట్లు సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవల వెల్లడించారు. ఫేస్‌బుక్‌తో పాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రామ్‌, మెసేంజర్‌, వాట్సాప్‌ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉండబోతుందని ఆయన చెప్పారు.

Related posts

Facebook: నవంబరులో కొత్త పేరుతో ఫేస్‌బుక్ ?

Hardworkneverfail

Facebook: ఫేస్‌బుక్‌ యూజర్లకు భారీ షాక్‌..!

Hardworkneverfail

Facebook: ఫేస్‌బుక్‌పై £50.5 మిలియన్ (రూ. 520 కోట్లు) జరిమానా !

Hardworkneverfail

ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన ఫేస్‎బుక్, వాట్సప్, ఇన్‎స్టా సేవలు

Hardworkneverfail