Avatar 2 Trailer : అవతార్ మూవీ 2009 లో బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆ మూవీ సాధించిన కలెక్షన్స్ రికార్డులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ నంబర్ 1 గా ఉన్న అవతార్ మూవీ రికార్డులను బ్రేక్ చేయడానికి అవతార్ 2 మూవీ డిలే తర్వాత ఎట్టకేలకు ఈ ఇయర్ డిసెంబర్ 16 న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
కాగా అవతార్ 2 మూవీ (Avatar: The Way of Water) అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత విజువల్ వండర్ గా ఉందని చెప్పాలి. ప్రతీ సీన్ అందమైన పెయిటింగ్ గా మెప్పించిన ఈ విజువల్ వండర్, భారీ గ్రాండియర్ గా అనిపించినా అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని పిస్తుంది. ఇండియాలో అవతార్ 2 మూవీ కచ్చితంగా అవెంజర్స్ రికార్డ్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తమ్మీద ట్రైలర్ తోనే అవతార్ 2 మూవీ పై ప్రేక్షకులకు అమితమైన ఆసక్తి రేకెత్తించారు.