మొత్తానికి ఈవారం ఇంటి కొత్త కెప్టెన్ అయ్యాడు షణ్ముఖ్. దీంతో శుక్రవారం వరస్ట్ ఫెర్ఫామర్ ఎవరనేది నిర్ణయించాలని ఆదేశించాడు బిగ్ బాస్.. కాజల్-సన్నీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పాలని కెప్టెన్ షణ్ముఖ్ మరోసారి అడగ్గా.. అనీ మాస్టర్ తన నిర్ణయాత్మక ఓటును సన్నీకే వేయడంతో అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సన్నీ-మానస్-కాజల్-సిరి-జెస్సీ-షణ్ముఖ్‌ల మధ్య ఎడతెగని చర్చ జరిగింది. టాస్క్ సందర్భంగా తన కాలు జెస్సీకి తగిలిందని నిరూపిస్తే.. బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సన్నీ సవాలు విసిరాడు. ‘‘నేను మాట్లాడడం మొదలు పెడితే ఈ రోజు మొత్తం సరిపోదు’’ అని సన్నీ అన్నాడు.