Bright Telangana
Image default

హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

మరోసారి హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, సరూర్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్‌, పంజాగుట్ట, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పూర్‌, రాంనగర్‌, మోహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, అత్తాపూర్‌లో వర్షం పడింది.

దీంతో అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ హై అలర్డ్‌ ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది.

Related posts

GHMC: కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి 36 గంటల్లో 15,000.. ఫిర్యాదుల వెల్లువ

Hardworkneverfail