Morbi Cable Bridge Collapse : గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్నకేబుల్ బ్రిడ్జి ఆదివారం తెగిన ఘటనలో 141 మంది మరణించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
దాదాపు వందేళ్ల క్రితం నాటి ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పనులు పూర్తి చేసి తిరిగి ప్రజల సందర్శన కోసం తెరిచారు. అది జరిగిన నాలుగైదు రోజులకే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో జనం ఈ వంతెనపై నిలబడటంతో సామర్థ్యానికి మించి బరువు కావడం వల్ల కూలినట్టుగా మొదట అధికారులు అంచనా వేశారు.
తాజాగా సీసీ ఫుటేజీలో గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వంతెన కూలిపోవడం అంతకుముందు జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో సందర్శకులు కనిపిస్తున్నారు.
కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని అటూఇటూ ఊపుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అసలు వంతెనపై ఏం జరిగింది? వెంటనే నదిలో దూకి కాపాడిన వారు ఏం చెప్పారు? ఈ వీడియోలో చూడండి..