Loco Pilot Applies Emergency Brakes to Save Man – ముంబై : రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని అప్రమత్తమైన లోకో పైలట్ కాపాడాడు. ముంబైలోని శివ్డీ స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి రైలు పట్టాలపైకి నడుస్తూ, రైలు వచ్చే ముందు పడుకుని ఉన్న వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకుంది. దీంతో అప్రమత్తమైన రైలు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి అతడిని కాపాడాడు.
కొందరు ఆర్పీఎఫ్ పోలీసులు అతని వద్దకు చేరుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మీ జీవితం విలువైనది, మీ కోసం ఇంట్లో ఎవరైనా ఎదురు చూస్తున్నారు’ అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన లోకో పైలట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.