Bright Telangana
Image default

2023 celebrations : కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజీలాండ్

2023 celebrations in new zealand

2023 Celebrations : మరికొద్ది గంటల్లో ఇండియాలో నూతన సంవత్సరం మొదలుకానుంది. అయితే మనకంటే ముందే కొన్ని దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాయి. పసిఫిక్‌ మహా సముద్రంలోని సమోవా ద్వీపం అందరికంటే ముందుగా 2023ని ఆహ్వానించింది. మన కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ నూతన సంవత్సరం వచ్చేసింది. కాసేపటికే టోంగా, కిరిబాటి దీవులు కూడా 2023లోకి అడుగుపెట్టాయి. ఆ తర్వాత న్యూజిలాండ్‌ కూడా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించింది.

ఇండియాలో సాయంత్రం 4.30 గంటలు అవుతున్నప్పుడు వెల్లింగ్టన్‌ కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు కొత్త ఏడాది మొదలవుతుంది. ఇక సూర్యోదయ భూమిగా పేరున్న జపాన్‌ కూడా మూడున్నర గంటల ముందే 2023లోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియా, ఉత్తరకొరియా కూడా కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తుంది. ఇండియా పొరుగు దేశాలైన భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లు మనకంటే.. 30 నిమిషాల ముందు కొత్త సంవత్సరంలోకి వెళ్తాయి.

సమోవాలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలకు మనం 2023లోకి అడుగుపెడతాం. అదే సమయానికి ఇండియాతో పాటు శ్రీలంకలోనూ జనవరి ఒకటి వస్తుంది. ఇక మన తర్వాత సుమారు నాలుగున్నర గంటలకు అత్యధికంగా 43 దేశాలు ఒకేసారి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్‌, ఇటలీ లాంటి ఐరోపా దేశాలతో పాటు కాంగో, అంగోలా, కామెరూన్‌ లాంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి.

2023కి న్యూజీలాండ్‌ ఘనస్వాగతం పలికింది. ఆక్లాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. స్కై టవర్ నుంచి రంగురంగుల బాణాసంచా కాల్చారు. అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆ వేడుకలను వీక్షించారు.

Related posts

Viral Video: సింగూరు డ్యామ్‌లో నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకెళ్లాయి?

Hardworkneverfail

Viral News : ట్రైన్ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌…నెటిజన్ల ప్రశంసలు..!

Hardworkneverfail

Bipin Rawat Army Helicopter : హెలికాప్టర్ కూలిపోతుండగా స్థానికులు తీసిన వీడియో

Hardworkneverfail

Earthquake : తైవాన్‌లో భూకంప తీవ్రతకు రైలు బొమ్మలా ఊగిపోయింది

Hardworkneverfail

Tirupati: తిరుపతిలో వింత ఘటన.. భూమిని చీల్చుకొని బయటకు వచ్చిన బావి..

Hardworkneverfail

Boy Flew With Kite: గాలిపటంతో పాటు 40 అడుగుల ఎత్తుకు వెళ్లిన యువకుడు

Hardworkneverfail