Bipin Rawat Army Helicopter Crash Video : హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది మరణించారు. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ విషాదం సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ క్రాష్ అయిన తరువాత మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో వీరంతా మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు హెలికాప్టర్ కూలిపోతుండగా వీడియో తీశారు.