Bright Telangana
Image default

CDS Bipin Rawat Death : హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ కన్నుమూత..

Bipin Rawat passes away in chopper crash

CDS Bipin Rawat Death : హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్‌ పైలెట్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ 80 శాతం గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. తమిళనాడులోని కూనూరు దగ్గర ప్రమాదవశాత్తు ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

ఈ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది మరణించారు. మరో 5 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌ క్రాష్ తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. వీరంతా మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉన్నారు. భారత రక్షణ, భద్రతా రంగాలలో గొప్ప సంస్కరణలకు కారకుడైన బిపిన్ రావత్ ఇంత అర్ధాంతరంగా కన్నుమూయడం యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బిపిన్ రావత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related posts

LIVE : కుప్పకూలిన డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్

Hardworkneverfail

Bipin Rawat Army Helicopter : హెలికాప్టర్ కూలిపోతుండగా స్థానికులు తీసిన వీడియో

Hardworkneverfail