Defence Helicopter Crashes In Coonoor : చీఫ్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్క్రాష్ అయింది. తమిళనాడులోని కూనురు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోగా ప్రమాద సమయంలో చాపర్ లో రావత్ తో పాటు 14 మంది ఉన్నారు. వీరిలో రావత్ కుటుంబసభ్యులు మరియు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించినట్టు గుర్తించారు.
ఆర్మీ అధికారులతో పాటు స్థానికులు కూడా మిగిలిన వారికోసం గాలింపు జరుపుతున్నారు. మరోవైపు ప్రమదానికి గురైన హెలికాప్టర్ కాలి బూడిదైపోయింది. అందులో నలుగురు మృతిచెందినట్టు నీలగిరి కలెక్టర్ వెల్లడించారు.. అయితే, ఎవరు మృతిచెందారు అనే పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.