YSR Housing Scheme : ఏపీలో వైఎస్సార్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 31 లక్షల మందికి పట్టాలిచ్చారు. తొలి విడతలో 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ వాస్తవంగా కాలనీల నిర్మాణం ఎలా ఉందో బీబీసీ పరిశీలించింది. ఆచరణలో కొన్ని కాలనీల నిర్మాణం ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, అత్యధిక ప్రాంతాల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది.