Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్ II బ్రిటన్ రాణిగా 70 ఏళ్ల పాటు కొనసాగారు. బ్రిటన్‌తో సహా 14 ఇతర దేశాలకు ఆమె దేశాధినేత. 96 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూసిన ఎలిజబెత్ రాణి 1986లో ఓ లేఖ రాశారు.
అప్పుడు ఆమె రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె రాసిన లేఖలో ఏముందో ఎవరికీ తెలియదు. ఆ లేఖలో ఏముందో తెలియాలంటే ప్రపంచం 63 ఏళ్లు ఆగాల్సిందే. రాణి ఆ ఉత్తరం ఎవరికి రాసింది? ఆ లేఖ ఇప్పుడు ఎక్కడ ఉంది?
క్వీన్ ఎలిజబెత్ II దేశానికి అధిపతిగా ఉన్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా ఉంది. అందుకే, ఆ దేశా అధినేతగా ఆమె దాదాపు 16 సార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు. నవంబర్ 1986లో రాణి ఆస్ట్రేలియాను సందర్శించినప్పుడు, ఆమె సిడ్నీ ప్రజలకు ఒక రహస్య లేఖ రాసింది. అక్కడి పాలకులకు లేఖ ఇచ్చి 2085 వరకు తెరవవద్దని ఆదేశించారు.
అంతేకాకుండా, 2085లో ఒక రోజును ఎంపిక చేసి, సిడ్నీ ప్రజలకు లేఖలో తన సందేశాన్ని తెలియజేయాలని సంబంధిత అధికారులకు తెలిపినట్లు ఆమె తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ II రాసిన లేఖలో ఏముందో ఆమె వ్యక్తిగత సిబ్బందికి కూడా తెలియదు.
ప్రస్తుతం, ఈ లేఖ ఆస్ట్రేలియాలోని క్వీన్ విక్టోరియా బిల్డింగ్‌లోని అత్యంత సురక్షితమైన లాకర్‌లో ఉంది. క్వీన్ ఎలిజబెత్ మరణానంతరం ఆమె లేఖపై చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే, క్వీన్ ఎలిజబెత్ II మరణానంతరం, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ మాట్లాడుతూ, క్వీన్స్ హృదయంలో ఆస్ట్రేలియాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 ఆస్ట్రేలియా పర్యటనలను చూస్తే అర్థమవుతుందని అన్నారు.