Bright Telangana
Image default

James Anderson: జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు..

record breaking feat james anderson completed 100th test home

Record Breaking Feat James Anderson Completed 100th Test Home : ఇంగ్లండ్ వెటరన్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో 100 టెస్టులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా జేమ్స్ అండర్సన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో అండర్సన్ ఈ ఘనత సాధించాడు. అండర్సన్ తర్వాతి స్థానంలో టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (94 టెస్టులు) రెండో స్థానంలో, ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ (92 టెస్టులు స్వదేశంలో) మూడో స్థానంలో, ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (91 టెస్టులు స్వదేశంలో) నాలుగో స్థానంలో ఉన్నారు. .

అండర్సన్ తర్వాత స్వదేశంలో 100 టెస్టులు ఆడే అవకాశం స్టువర్ట్ బ్రాడ్‌కు మాత్రమే ఉంది. ఇటీవలే 40 ఏళ్లు పూర్తి చేసుకున్న అండర్సన్.. వయసు పైబడినా బౌలింగ్‌లో అద్భుతంగా ఉన్నాడు. తన 19 ఏళ్ల కెరీర్‌లో అండర్సన్ ఇంగ్లండ్ తరఫున 174 టెస్టులు ఆడి 658 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం అండర్సన్ మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు) మొదటి స్థానంలో, దివంగత ఆసీస్ స్పిన్నర్ షేన్ వార్న్ (708 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నారు.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్రారంభమైన రెండో టెస్టు సానుకూలంగా ప్రారంభమైంది. లంచ్ విరామం తర్వాత దక్షిణాఫ్రికా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు, స్టోక్స్, బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.

Related posts

T20 Word Cup 2022 : సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ ఓటమి..

Hardworkneverfail

T20 World Cup 2021: విండీస్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021 : ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రికాదే విజయం.. అయినా ఇంటికే..

Hardworkneverfail