SkyLab Movie OTT Release Date : టాలీవుడ్ హీరో సత్యదేవ్, హీరోయిన్ నిత్యామీనన్ మరియు రాహుల్ రామకృష్ణన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ స్కైలాబ్. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీకి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహించారు. పిరియాడికల్ డ్రామాగా 2021, డిసెంబర్ 4న విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకొంది. ఇక ఈ మూవీ ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఓటిటీ లోకి అడుగుపెట్టనుంది. భారీ ధరకు స్కైలాబ్ మూవీని సోని లివ్ ఓటీటీ వారు తెలుగు లో స్ట్రీమింగ్ చేసేందుకు గాను మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నారు. జనవరి 14 న స్కైలాబ్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ నిత్యామీనన్ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. మరి థియేటరర్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటిటీ లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి అంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.skylab movie ott release
Whatever the problem is Dr.Anand has a perfect solution for you. Get ready to meet him on his clinic in Skylab, streaming on Jan 14 only on SonyLIV.#SkylabOnSonyLIV #ThetaleofBandalingampalli@MenenNithya @ActorSatyaDev @eyrahul @VishvakKhander1 @prashanthvihari @javvadiAditya pic.twitter.com/oS1bXvGNJS
— SonyLIV (@SonyLIV) January 11, 2022