మెగాస్టార్ చిరంజీవి, బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీర్రాజు (టైటిల్ పరిశీలిస్తున్నారు) ఈ సినిమాను 2022 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని మాస్ ప్రేక్షకులు ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను దర్శకుడు బాబి ప్రాజెక్ట్ ను ప్రజెంట్ చేయబోతున్నాడట.
ఇక సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం మాస్ రాజా రవితేజను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీతో ఇదివరకే రవితేజ పవర్ అనే సినిమా చేశాడు. కథ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోకు అవకాశం ఉంది. ఆ పాత్రను రవితేజ వంటి ఎనర్జిటిక్ హీరోతో చేయిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో బాబీ ఈ సినిమా కోసం కలిసాడట. పైగా చిరంజీవి హీరో కావడంతో రవితేజ ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కూడా రవితేజ కెరీర్ మొదట్లో రెండు సినిమాలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య సినిమాలో తమ్ముడిగా కనిపించిన రవితేజ ఆ తర్వాత చాలా ఏళ్ళకు హీరోగా మారిన తర్వాత శంకర్ దాదా జిందాబాద్ లో ఒక సాంగ్ లో కనిపించాడు.