Bright Telangana
Image default

Bhola Shankar : భోళా శంకర్‌లో చిరంజీవి సరసన తమన్నా ఖరారు..

tamannaah bhatia

మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీగా ‘భోళా శంకర్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. నవంబర్‌ 11న ఈ మూవీ పూజ కార్యక్రమం జరగనుందని, నవంబర్‌ 15 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు ఇటీవల మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మూవీకి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. అన్నాచెల్లెల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరంజీవికి జోడి కట్టనుంది ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార పేరు వినిపించగా కొద్ది రోజుల నుంచి తమన్నా పేరు తెరపై వచ్చింది. తాజాగా ఈ మూవీలో తమన్నాను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసారు.

తమన్నా కూడా తన ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడి‍స్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమన్నా ట్వీట్‌ చేస్తూ.. ‘మెగా మాసివ్‌ మూవీ భోలా శంకర్‌లో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి మరోసారి నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ గారు దీనిని నిజం చేస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది.

Related posts

కొండపొలం మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్: ప్రకాశ్ రాజ్

Hardworkneverfail

Actress Hamsa Nandini : సినీ నటి హంసా నందినికి క్యాన్సర్.. గ్రేడ్‌ 3‏గా నిర్దారణ..

Hardworkneverfail

Manchi Rojulochaie: ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్..నాటు డాన్సులతో కుమ్మేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్..

Hardworkneverfail