Saana Kastam Lyrical From Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’ మూవీ నుంచి ‘శానా కష్టం’ అనే మాస్ మసాలా సాంగ్ విడుదలైంది. ‘శానా కష్టం’ లిరికల్ సాంగ్ ను మూవీ యూనిట్ యూట్యూబ్ లో పంచుకుంది. ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన రెజీనా కసాండ్రా నటించింది. మణిశర్మ నేపథ్య సంగీతం అందించగా, భాస్కర భట్ల సాహిత్యం అందించారు.
‘ఆచార్య’ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ కు జోడీగా అందాల భామ పూజా హెగ్డే కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.