లవ్‌స్టోరీ’మూవీతో చాలా రోజుల తర్వాత సూపర్‌హిట్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ మూవీ గత నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ని తాజాగా ప్రకటించారు. అక్టోబర్ 22న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా అందుబాటులో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. మరోవైపు, ‘లవ్‌స్టోరీ’ మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ.. ఆహా ఓ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. నటీనటులపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
ఫీల్‌గుడ్ మూవీగా తెరకెక్కి.. ఆన్‌స్క్రీన్‌పై మ్యాజిక్ క్రియేట్ చేసిన ‘లవ్‌స్టోరీ’ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో రేవంత్ అనే మధ్యతరగతి కుర్రాడిలా నాగచైతన్య.. మౌనిక అనే పెద్దింటి అమ్మాయిగా సాయిపల్లవి నటించి మెప్పించారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మించారు.