Pushpa Movie Trailer Delay : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప . ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నాహీరోయిన్ గా నటిస్తుండగా.. విలన్ గా ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి.
పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ ‘పుష్ప’ మూవీ ట్రైలర్ ని ఈరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందరు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న క్షణంలో మైత్రి మూవీస్ వారు షాక్ ఇచ్చారు .. కొన్ని ఊహించని టెక్నీకల్ ఇష్యూస్ వలన ట్రైలర్ వాయిదా పడుతున్నట్లు తెలిపారు. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మైత్రి మూవీస్ త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ పై బన్నీ ఫాన్స్ మండిపడుతున్నారు. అయితే వాయిదా పడింది అని చెప్పిన మూవీ యూనిట్ మళ్లీ రిలీజ్ ఎప్పుడు చేస్తారో చెప్పకపోయేసరికి ఇంకా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మరి ఈ ‘పుష్ప’ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
#PushpaTrailer pic.twitter.com/xzhyn8XMpt
— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2021