Karthikeya 2 Box Office Collections : అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే అది బాలీవుడ్‌ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి పెద్ద మూవీస్ హిందీ బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేశాయి.
నార్త్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నిఖిల్ నటించిన ఈ మీడియం రేంజ్ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘శంషేరా’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘రక్షా బంధన్’ వంటి ప్రముఖ హిందీ మూవీస్ గా బాలీవుడ్‌కు ఊపునిచ్చింది కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాయి.
కేవలం 50 థియేటర్లలో మొదలైన ఈ మూవీ ఇప్పుడు మూడు వేలకు పైగా స్క్రీన్లలో విజయవంతంగా ప్రదర్శింపబడడం అంటే మామూలు విషయం కాదు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ మూవీస్ ఘోరంగా విఫలం కావడంతో థియేటర్ నిర్వాహకులు ఈ పెద్ద చిత్రాలను తీసి కార్తికేయ 2 మూవీని నడుపుతున్నారు.
మొత్తం మీద ఈ మూవీ వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే.. కృష్ణాష్టమి పండుగను ఈ మూవీ క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీస్ గా కార్తికేయ 2 నిలిచింది. చందు మొండేటి దర్శకత్వంలో ఆగస్టు 13న విడుదలైన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.
#Karthikeya2 #Hindi emerges first choice of moviegoers… Collects more than #LSC and #RB *yesterday* [Fri]… Mass pockets/single screens are super-strong… Will continue to dominate over the weekend… [Week 2] Fri 2.46 cr. Total: ₹ 8.21 cr. #India biz. HINDI version. pic.twitter.com/E6cKGuG6b8
— taran adarsh (@taran_adarsh) August 20, 2022