తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున.. వీరి ముగ్గురికి క్లాస్ తీసుకుంటూ కనిపించాడు. అందులో ముందు ప్రియను హగ్ చేసుకోవడం అంటే బిజీగా ఉన్నట్టా ? అది తప్పా ? అంటూ అడిగేశారు. ఆ తర్వాత రవి, ప్రియ నేమ్ ప్లేట్‌ను సుత్తితో ముక్కలు చేశాడు. ఇక ఆతర్వాత.. రవిని.. నువ్వు ప్రియతో సింగిల్ మెన్ అనే మాట అన్నావా ? అని ప్రశ్నించగా.. అన్నాను సర్ అంటూ ఒప్పుకున్నాడు. ప్రియ ఒప్పుకున్నాడా ? అని అడగ్గా.. ఇప్పటివరకు ఒప్పుకోలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత లహరిని పవర్ రూంకు పంపి.. రవి, ప్రియ ఇద్దరూ మాట్లాడుకున్న వీడియోను చూపించి లహరికి షాకిచ్చాడు బిగ్‌బాస్. నీకు క్లారిటీ వచ్చింది కదా.. తప్పు ఎవరు చేశారో. బయటకు వెళ్లాక.. తప్పు లేనివాళ్లను హగ్ చేసుకోవాలని చెప్పాడు. మరి బయటకు వెళ్లిన లహరి.. రవికి సపోర్ట్ చేస్తుందా ? లేదా ప్రియకు సపోర్ట్ చేస్తుందా ? అనేది చూడాలి.