తెలంగాణ : స్వతంత్ర భారత చరిత్రలో మొదటి సారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తున్న అతిపెద్ద దేవాలయం యాదాద్రి. యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణం దాదాపు పూర్తైంది. యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి నూతన దేవాలయాన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించిన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దారు. అలనాటి వైభవం, ఆధునిక పరిజ్ఞాన మేళవింపు ఈ నిర్మాణంలో కనిపిస్తుంది.
యాదాద్రి ఇప్పుడు ఎలా మారిపోయిందో మీరే చూడండి…