బాలకృష్ణ ఓటీటీ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతో ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇక ఈ ప్రోగ్రాం కి ‘జాంబీ రెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపావళి రోజు నుంచి ఈ షో స్ట్రీమింగ్ అవుతూ.. విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక మొదటి ఎపిసోడ్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సందడి చేశారు బాలకృష్ణ.
ఆ తరువాత ఎపిసోడ్ ను నానితో చేశారు. స్టేజ్ పైనే చిన్న చిన్న గేమ్స్ ప్లాన్ చేసినా, ఈ ఎపిసోడ్ అంతగా పేలలేదు. బాలకృష్ణ వైపు నుంచి కొంత ఎమోషన్ ను కనెక్ట్ చేయటం వలన, కొంతలో కొంతవరకూ ఆ ఎపిసోడ్ కి హెల్ప్ అయింది. ఇక త్వరలో ఈ షోలో రోజా కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు మరో స్పెషల్ గెస్ట్ తో మరో ఎపిసోడ్ చేయనున్నట్లుగా జరుగుతున్న ఓ ప్రచారం మరింత ఆసక్తికరంగా మారింది. ఆ గెస్ట్ ఎవరో కాదు నటి, ఎమ్మెల్యే రోజా సెల్వమణి.
ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జిగా వ్యహరిస్తున్న రోజా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే. అయితే.. బాలకృష్ణ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే. మరి ఇప్పుడు రోజాను బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలను సంధించనున్నారు..? ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా సమాధానాలు ఎలా ఉండనున్నాయి?.. ఫైనల్ గా ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.