Bright Telangana
Image default

ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

most eligible bachelor movie collections

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ‘జీఏ2 పిక్చర్స్‌’ పతాకంపై బన్నీ వాస్‌, వాసు వర్మ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల అయ్యింది. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీకి రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ ముగిసేసరికి 4.77 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్‌-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీనీ ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఆహా యాజమాన్యం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీనీ నవంబర్‌ 19న ఆహాలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీనీ ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదల చేస్తుండడం విశేషం. మరి బిగ్‌ స్క్రీన్‌పై వండర్స్‌ క్రియేట్‌ చేసి అఖిల్‌ కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచిన ఈ మూవీనీ ఓటీటీలో ఎలాంటి అద్భుతం సృష్టిస్తుందో చూడాలి.

Related posts

God Father : ఓటీటీలో దుమ్ములేపుతున్న మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ మూవీ..!

Hardworkneverfail

Pushpaka Vimanam OTT: ఆహాలో ‘పుష్పక విమానం’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్.. ఎప్పుడంటే..?

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

Unstoppable With NBK : బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోలో మహేశ్ బాబు..!

Hardworkneverfail

3 Roses: ‘ఆహా’లో డైరెక్ట‌ర్ మారుతి స‌రికొత్త వెబ్ సిరీస్‌ ‘త్రీ రోజెస్’

Hardworkneverfail

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail