శ్రీవిష్ణు హీరోగా ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ సూపర్‌హిట్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్థమైంది.
అక్టోబరు 8 నుంచి ‘జీ 5’ ఓటీటీలో స్ర్టీమింగ్‌కానుంది. హసిత్ గోలి తెరకెక్కించిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన కథానాయికలు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రం థియేటర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కథ, కథనాలు శ్రీవిష్ణు నటన ప్రేక్షకులను మెప్పించింది.