Mahesh Babu Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ ఓటీటీలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్'(Unstoppable With NBK) షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుండడం తెలిసిందే. ఈ టాక్ షోలో ఇప్పటివరకు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి విచ్చేసి సందడి చేశారు.
తాజా ఎపిసోడ్ కు సంబంధించి సూపర్ స్టార్ మహేశ్ బాబు వచ్చారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. బాలకృష్ణతో సరదాగా గడిచిందని షూటింగ్ అనంతరం మహేశ్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది తెలుస్తుంది. ఇక ఈ ఇద్దరు కలిసి పై ఏ రేంజ్ లో సందడి చేశారనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా ఆగాల్సిందే.