Bright Telangana
Image default

Unstoppable Season Finale : ‘అన్ స్టాపబుల్ షో’లో ‘మహేష్ బాబు’ సందడి

Unstoppable Season Finale Episode with Mahesh Babu

Unstoppable Season Finale Episode with Mahesh Babu : నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ తనదైన శైలిలో చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షోకు ఆహా ఓటీటీలో మంచి రేటింగ్ వస్తోంది. ఇండియాలోనే నంబర్ వన్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ రికార్డు సృష్టించింది. ఐఎండీబీలో కూడా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో ఏకంగా 9.8 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో మొదటి సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా రానున్నాడు. దీనికి సంబంధించిన స్పెషల్ ప్రోమోను ఆహా షో మేకర్స్ రివీల్ చేశారు..

తాజాగా ఈ చివరి ఎపిసోడ్‌ (Unstoppable Season Finale) స్ట్రీమింగ్ తేదీని ఆహా ప్రకటించింది. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. గత నెల డిసెంబర్ లోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో చివరి ఎపిసోడ్‌కు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇప్పుడు బాబాయ్ బాలకృష్ణ షోకు కూడా చివరి ఎపిసోడ్ మహేష్‌ బాబుదే కావడం విశేషం. ఈ ఎపిసోడ్ కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్‌ షోలో భాగంగా 9 ఎపిసోడ్లు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి.

Related posts

Unstoppable With NBK : బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో బాలయ్య అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్

Hardworkneverfail

Love Story: ఓటీటీలో నాగచైతన్య ‘లవ్ స్టొరీ’ మూవీ..ఎప్పుడంటే?

Hardworkneverfail

Nandamuri Balakrishna: వైసీపీ నేతలకు బాలకృష్ణ వార్నింగ్..

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌ చిత్రం ‘కోల్డ్ కేస్‌’

Hardworkneverfail

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail