Bright Telangana

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న పృథ్వీరాజ్ సుకుమారన్‌ చిత్రం ‘కోల్డ్ కేస్‌’

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఆహా. ఇప్పుడీ కోవ‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌, అదితి బాల‌న్, పూజా మోహ‌న్‌రాజ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘కోల్డ్ కేస్‌’.. అక్టోబ‌ర్ 8న ప్రీమియ‌ర్‌గా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల‌యాళంలో ‘కోల్డ్ కేస్‌’ అనే పేరుతోనే తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫ‌ర్ త‌ను బాల‌క్ ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించారు. సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్క్రీన్‌ను అతుక్కుపోయేలా చేసే రోల‌ర్ కోస్ట‌ర్ ‘కోల్డ్ కేస్‌’.

రీసెంట్‌గా ఆహాలో విడుద‌లైన ఈ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఫ‌ర్‌ఫెక్ట్ థ్రిల్ల‌ర్ మూవీ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఓ స‌రస్సులో పుర్రె దొరుకుతుంది. అదెవ‌రిద‌నే విష‌యం పోలీసుల‌కు అంతు చిక్క‌దు. ఆ ర‌హస్యాన్ని చేదించ‌డానికి పోలీస్ క‌మీష‌న‌ర‌ల్ స‌త్య‌జిత్‌, జ‌ర్న‌లిస్ట్ మేథ చేసిన ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసుని చేధించ‌డానికి స‌త్య‌జిత్ ఏం చేశాడ‌నేదే క‌థ‌. జ‌ర్న‌లిస్ట్‌, సింగిల్ పేరెంట్ అయిన జ‌ర్న‌లిస్ట్ మేధ.. ఓ కొత్త ఇంటికి వెళుతుంది. ఆ ఇంట్లో అసాధార‌ణ‌మైన కొన్ని విష‌యాలు జ‌రుగుతాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మేమంటే, అవ‌న్నీ స‌త్య‌జిత్ ప‌రిశోధిస్తున్న కేసుకి క‌నెక్ట్ అవుతాయి. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి అస‌లు ర‌హ‌స్యాన్ని చేధించారా, హ‌త్య చేయ‌బ‌డింది ఎవ‌రు? అనే విష‌యాన్ని తెలుసుకున్నారా? అనేదే సినిమా.

Related posts

Suriya Jai Bheem: సూర్య ‘జై భీమ్‌’ మూవీ ఓటిటిలో విడుదల ఎప్పుడంటే..

Hardworkneverfail

Aha Video: 12 వారాలు… 90 రోజులు… 20 కొత్త సినిమాలు, షోలు!

Hardworkneverfail

OTT Movies Alert : ఈరోజు ఓటిటిలో మూడు పెద్ద సినిమాలు

Hardworkneverfail

Unstoppable with NBK : విభేదాలకు తెరదించిన ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో .. ఆహలో రెట్టింపైన ఆహ్లాదం

Hardworkneverfail

Pushpa Special on Unstoppable with NBK : బాలయ్యతో తగ్గేదేలే అనిపించిన ‘పుష్ప’ రాజ్..

Hardworkneverfail

Rana in Unstoppable with NBK : రానా తో సందడి చేయబోతున్న బాలయ్య..!

Hardworkneverfail