Three Telugu Movies Premiering in Ott Today : కరోనా మరియు ఒమైక్రాన్ వేరియంట్ వచ్చాక చాలా మంది మూవీస్ ఓటిటిలో వచ్చేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ టెన్షన్ లేకుండా ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో హ్యాపీగా మూవీస్ చూసే చేయవచ్చు. ఇక ఈరోజు ఓటీటీలో ఏకంగా మూడు మూవీస్ విడుదల అయ్యాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ కూడా ఉంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి ‘పుష్ప’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు యంగ్ హీరో నాగశౌర్య నటించిన రెండు మూవీస్ ‘లక్ష్య’ మరియు ‘వరుడు కావలెను’ మూవీస్ ఈ ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆహాలో ‘లక్ష్య’.. జీ5 ఓటీటీలో ‘వరుడు కావలెను’ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకే రోజున మూడు మూవీస్ ఓటీటీలో విడుదల కావడంతో మూవీ లవర్స్ ఖుషి ఖుషి గా ఉన్నారు. ott telugu movies