విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ‘దృశ్యం 2’. తాజాగా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ‘దృశ్యం 2’..అంతకముందు వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్‌గా రూపొందించారు. సీనియర్ హీరోయిన్ మీనా ఇందులో వెంకీ సరసన నటించారు. ఇన్ని రోజులు ఈ మూవీ థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘దృశ్యం 2’ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అలాగే, నవంబరు 25న ఈ మూవీ అమెజాన్ ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వెంకీ గత మూవీ ‘నారప్ప’ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై హిట్ సాధించింది. ఇప్పుడు ‘దృశ్యం 2’ కూడా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అవుతుంది.
will Rambabu be able to protect his family, this time? 🤔#Drushyam2OnPrime, Nov 25@VenkyMama #MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/9y0Ycou8Vv
— amazon prime video IN (@PrimeVideoIN) November 12, 2021