తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించింది. అరవింద్ స్వామి, మధుబాల, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఎ.ఎల్. విజయ్ దర్శకుడు. ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. మరోవైపు, ఇప్పటికే ఈ చిత్ర హిందీ వెర్షన్ ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా అలరిస్తోంది. త్వరలోనే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం వెర్షన్‌లు అందుబాటులోకి రానున్నాయి. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అక్టోబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.