సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 1న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ.. కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఇక ఫుల్ రన్లో ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.
రిపబ్లిక్’ మూవీ స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. నవంబర్ 26 నుంచి రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 13.60 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.7.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లకు రూ.6 కోట్ల పైనే నష్టాలు వాటిల్లాయి.