సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘జె.బి.ఎంటర్టైన్మెంట్స్’ ‘జీ స్టూడియోస్’ బ్యానర్ల పై జె.భగవాన్, జె.పుల్లారావు లు కలిసి నిర్మించారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలు పోషించారు.
రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వ రోజున రెండో రోజు తో పోల్చితే 10-15% వరకు డ్రాప్స్ కనిపించాయి. మొత్తం మీద 3 వ రోజున సినిమా 1.3 కోట్లకు పైగా షేర్ ని అందుకుంది. 5.07 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అక్టోబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.