Bright Telangana
Image default

Suriya Jai Bheem: సూర్య ‘జై భీమ్‌’ మూవీ ఓటిటిలో విడుదల ఎప్పుడంటే..

Surya Jai Bhim movie released on OTT

Jai Bheem Suriya: సహజ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరో సూర్య. సూర్య తాజాగా నటిస్తోన్న చిత్రం ‘జై భీమ్‌’. సోషల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టీజే జ్ఙానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మొదట్లో సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ.. అమెజాన్‌ వేదికగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా అమెజాన్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. దీపావళి కానుకగా ఈ సినిమాను నవంబర్‌ 2న విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. ‘మేము ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఎంతో ఆతృతగా ఉన్నాము. ఈ దీపావళికి జైభీమ్‌ను ప్రైమ్‌లో చూడండి’ అంటూ పేర్కొన్నారు. ఈ సినిమాలో ర‌జీష విజ‌య‌న్, లిజోమోల్ జోస్ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్నారు.

Related posts

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

Jai Bhim: సూర్య ‘జై భీమ్‌’ టీజర్‌ చూశారా?

Hardworkneverfail

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో కలిసి నటించనున్న వెంకటేష్, రానా దగ్గుబాటి

Hardworkneverfail

ఓటీటీలో శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’

Hardworkneverfail

Marakkar Movie OTT Release : ‘మరక్కర్’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

ఓటీటీలోకి ‘తలైవి’ తెలుగు వెర్షన్‌ ఎప్పుడంటే ..!

Hardworkneverfail