Bright Telangana
Image default

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో కలిసి నటించనున్న వెంకటేష్, రానా దగ్గుబాటి

దగ్గుబాటి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్‌- రానా కలిసి ఒకే స్క్రీన్‌లో సందడి చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ రూపొందించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో వీరిద్దరూ కలిసి స్క్రీన్‌ పంచుకోనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వెంకటేశ్ అధికారికంగా ప్రకటించారు. చిన్నపిల్లాడి నుంచి ఒక నటుడిగా రానా ఎదిగిన ప్రతిక్షణాన్ని తాను చూస్తూనే ఉన్నానని.. కానీ ‘రానా నాయుడు’లో మునుపటి కంటే పూర్తి విభిన్నంగా రానా కనిపించనున్నాడని వెంకటేశ్‌ తెలిపారు. రానా సైతం.. బాబాయ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో వెంకటేశ్‌ వృద్ధుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉండే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సిరీస్‌ రూపొందుతుందని సమాచారం.

Related posts

Bheemla Nayak Release Trailer : భీమ్లా నాయక్ కొత్త ట్రైలర్ రిలీజ్.. ఫ్యాన్స్‏కు ఇక పూనకాలే..

Hardworkneverfail

Drushyam 2: ‘దృశ్యం 2’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

Pawan Kalyan: దసరాకు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ నుండి మరో అప్‌డేట్

Hardworkneverfail

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఫోర్త్ సింగిల్.. అదిరిన అడవితల్లి మాట..

Hardworkneverfail

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ నుంచి వచ్చేస్తున్న ఫోర్త్ సింగిల్!

Hardworkneverfail